Atlee Rajinikanth Movie : షారుక్ ఖాన్ 'జవాన్'తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో బాద్ షాకు హిట్ అందించిన దర్శకుడు అట్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే కావడం విశేషం. అయితే ఆయన కెరీర్ ఎలా ప్రారంభమైందో తెలుసా? ఆయన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోబో సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ డూప్‌గా నటించారని తెలుసా? ఈ చిత్రంతోనే ఆయన కెరీర్ ప్రారంభమైందని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. ఆ విశేషాలను తెలుసుకుందాం..
షార్ట్ ఫిల్మ్‌తో శంకర్ దగ్గర.. అట్లీది మదురై. చెన్నైలో స్థిరపడ్డారు. తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అట్లీ.. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించారు. అయితే ఆయనలో మంచి డాన్సర్ కూడా ఉన్నారు. అందుకే సినిమాల్లో వెళ్లాలనుకున్నారు. దీంతో సత్యభామ వర్సిటీలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్‌లో జాయిన్ అయ్యారు. అప్పుడే డైరెక్షన్ వైపు వెళ్లారు. కాలేజీ ప్రాజెక్టులో భాగంగా - తన అమ్మకు ఉన్న ఏకైక గోల్డ్ చెయిన్‌ను అమ్మి.. ఓ షార్ట్‌ఫిల్మ్ తీశారు. అప్పుడే తన అరుణ్ కుమార్ పేరును అట్లీగా మార్చాకున్నారు. ఆ షార్ట్‌ఫిల్మ్ నేషనల్ కాంపీటిషన్స్ పోటీల్లో నెగ్గింది. దీంతో ఆయన శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు.