తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అట్లీ లిస్ట్​లో మరో స్టార్​ హీరో- స్క్రిప్ట్​ రెడీ! - Atlee latest news

Atlee Dream Project With Ajith Kumar : స్టార్ డైరెక్టర్‌ అట్లీ తీయనున్న చిత్రాలపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇటీవలే ఓ భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన ఆయన.. తాజాగా తన లిస్ట్‌లో మరో స్టార్ హీరో ఉన్నట్లు చెప్పారు.

Atlee Dream Project With Ajith Kumar
Atlee Dream Project With Ajith Kumar

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 8:36 PM IST

Atlee Dream Project With Ajith Kumar : 'జవాన్​' సినిమాతో బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ అట్లీ. స్టార్ హీరో షారుక్ ఖాన్ - లేడీ సూపర్​స్టార్ నయనతార లీడ్​ రోల్స్​లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక సెప్టెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సూపర్​ హిట్​గా నిలిచి రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే 'జవాన్' తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్లో తన కొత్త ప్రాజెక్ట్స్​ గురించి చెప్పారు అట్లీ. తాజాగా షారుక్​ ఖాన్- విజయ్​లతో సినిమా చేస్తున్నట్లు చెప్పిన అట్లీ.. ఇప్పుడు మరో స్టార్​ హీరో అజిత్​ కుమార్​తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అజిత్​ కుమార్ అంటే ఇష్టమని.. త్వరలోనే ఆయనతో సినిమా తీసే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు అట్లీ చెప్పారు. హీరో కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. " అజిత్​ కుమార్​కు సరిపోయే స్టోరీ నా దగ్గర ఉంది. దానిపై ఇంకా వర్క్ చేయాలి. ఆ స్టోరీ గురించి ఆయనకు చెప్పాలని ప్రయత్నించా.. కానీ కుదరలేదు. ఒకవేళ అజిత్​ అంగీకరిస్తే.. అది సూపర్​ హిట్ సినిమా అవుతుంది. ఆయన రమ్మని పిలవడమే ఆలస్యం వెళ్లి కథ గురించి చెబుతాను. ఆయన చాలా మంచి మనిషి.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్​ చేసి ఓదార్చారు." అని చెప్పారు.

తాజాగా అట్లీ.. భారీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. షారుక్- విజయ్‌లతో చేసే సినిమా కచ్చితంగా రూ.3000కోట్లు వసూళ్లు చేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా అట్లీ ఓ సినిమా తీయనున్నారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్​తో కలిసి కథపై చర్చలు కూడా జరిపారని.. ఇటీవలే ముంబయిలో కూడా కలిసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి! దీంతో ఇక ఈ సినిమా దాదాపుగా ఖరారైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఇక అధికార ప్రకటన కూడా త్వరలోనే వచ్చేస్తుందని టాక్​ వినిపిస్తోంది. ఇదంతా చూసిన అభిమానులు.. అట్లీ లైనప్‌ పెద్దదే అంటున్నారు.

Atlee Allu Arjun Movie : అట్లీకి ముందుంది అసలు పరీక్ష.. అల్లు అర్జున్​తో సినిమా అంటే అలా జరగాల్సిందే!

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

ABOUT THE AUTHOR

...view details