టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న తర్వాత మీడియాలో చాలా సార్లు హాట్‌టాపిక్‌గా మారారు. అయితే సినిమాల పరంగా ఎవరీ లైఫ్‌లో వారు బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ విషయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నారు. అయితే ప్రస్తుతం 'శాకుంతలం' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమంత... తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. తనతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మధ్య రిలేషన్ ఉన్నట్లు వస్తున్న పుకార్లపై సామ్ స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. చైతూ పేరు చెప్పకుండా.. "ఎవరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారని నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పినట్లు పలు వెబ్సైట్లు కథనాలు రాస్తున్నాయి. అయితే ఈ మాట విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురౌతున్నారు.
నేనలా అనలేదు.. అయితే ఈ ప్రచారంపై సమంత సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. తాను అలా అనలేదంటూ చెప్పుకొచ్చింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపారేసింది. ఓ వైబ్‌సైట్ కథనాన్ని ప్రస్తావిస్తూ.. 'నేను ఇలా చెప్పలేదు' అని ట్వీట్ చేసింది. అంతకుముందు ఏప్రిల్ 4న పాల్గొన్న ఇంటర్వ్యూలో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను గుర్తు చేసుకుంది. ఆ రోజులను చీకటి క్షణాలుగా పేర్కొంది. ఆ బాధ నుంచి తానింకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది.