తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హరిద్వార్​లో కృష్ణ అస్థికల నిమజ్జనం.. మనవడి చేతుల మీదుగా.. - రమేశ్​బాబు కుమారుడు జయకృష్ణ భావోద్వేగం

తెలుగు సినీ దిగ్గజం సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను ఆయన మనవడు జయకృష్ణ గంగా నదిలో కలిపారు. ఆ సమయంలో జయకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు.

super star krishna
కృష్ణ అస్థికలను నిమజ్జనం చేసిన మనవడు జయకృష్ణ

By

Published : Nov 23, 2022, 2:05 PM IST

Updated : Nov 23, 2022, 3:54 PM IST

కృష్ణ అస్థికల నిమజ్జనం

ఇటీవల మృతి చెందిన సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఉత్తరాఖండ్​లోని హరిద్వార్‌లో గంగా నదిలో కలిపాడు. ఆ సమయంలో తన తాతను గుర్తు చేసుకొని జయకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో ఉన్న జయకృష్ణ... తాత మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన అక్కడి నుంచి బయల్దేరి వచ్చారు.

అప్పటికే కృష్ణ అంత్యక్రియలు పూర్తికావడం వల్ల చివరి చూపు దక్కలేదని జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ నవంబర్​ 15న గచ్చిబౌలి కాంటినెంటల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

హరిద్వార్​లో కృష్ణ అస్థికల నిమజ్జనం
హరిద్వార్​లో కృష్ణ అస్థికల నిమజ్జనం
హరిద్వార్​లో కృష్ణ అస్థికల నిమజ్జనం
Last Updated : Nov 23, 2022, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details