తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్యను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్​ యాక్టర్​​.. మిస్​ వరల్డ్​తో 'మెగా​' హీరో! - వరుణ్​తేజ్​ అప్​కమింగ్​ మూవీస్​

నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'వీరసింహారెడ్డి'​ మూవీ కోసం ఓ బాలీవుడ్​ నటుడు విలన్​గా రానున్నారు. మరోవైవు విశ్వసుందరితో ఓ యువ స్టార్​ జతకట్టనున్నారట. ఆ వివరాలు..

arjun rampal to act as villain in veera simha reddy
arjun rampal to act as villain in veera simha reddy

By

Published : Nov 17, 2022, 6:57 AM IST

NBK 107 Veera Simha Reddy : 'వీరసింహారెడ్డి'గా సంక్రాంతికి సందడి చేయనున్నారు బాలకృష్ణ. ఒకపక్క ఆ సినిమా పనులు కొనసాగుతుంటే, మరోపక్క అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి సంబంధించిన సన్నాహాలూ ఊపందుకున్నాయి. ఇందులో బాలయ్యకి జోడీగా నటించే కథానాయిక, ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయక పాత్రల కోసం బాలీవుడ్‌ నటుల్నే ఎంపిక చేసుకోవాలనేది అనిల్‌ రావిపూడి వ్యూహం.

అర్జున్​ రామ్​పాల్​

ఆ మేరకు కొన్ని రోజులుగా నటీనటుల ఎంపికకి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా విలన్‌ పాత్రకోసం అర్జున్‌ రాంపాల్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఆయనతో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. కథానాయికగా ఇదివరకు కొన్ని పేర్లు వినిపించినా, ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. బాలకృష్ణకు తగ్గ కథానాయికని ఎంపిక చేయడం కోసం అనిల్‌ రావిపూడి బృందం పలువురు కథానాయికల పేర్లని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రపంచ సుందరితో ఆరడుగుల అందగాడు..
Manushi chillar : యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మాజీ ప్రపంచ సుందరితో జట్టు కట్టనున్నాడా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుణ్‌తేజ్‌ తదుపరి చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. యథార్థ సంఘటనల ఆధారంగా, వైమానిక దళం నేపథ్యంలో సాగే కథ ఇది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరులో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ఎంపికైనట్టు సమాచారం.'పృథ్వీరాజ్‌' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు.

మానుషి చిల్లర్​

మరో ప్రాజెక్ట్​తో 'ప్రేమమ్​' మలయాళం దర్శకుడు..
పృథ్విరాజ్‌ సుకుమారన్‌, నయనతార జంటగా నటించిన చిత్రం 'గోల్డ్‌'. ఆల్ఫోన్స్‌ పుతేరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని థియేటర్లలో వచ్చే నెల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మొబైల్‌ షాపు యజమాని కొన్న కారు చుట్టూ తిరిగే కథతో సాగుతుంది. ‘ప్రేమమ్‌’ లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్న ఆల్ఫోన్స్‌ నుంచి వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

గోల్డ్​ మూవీ పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details