మ్యాన్లీ లుక్స్‌తో, బోల్డ్ వాయిస్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు అర్జున్‌దాస్. ఖైదీ, మాస్టర్, విక్రమ్ తదితర చిత్రాల్లో కీలకపాత్ర పోషించి.. తన గంభీరమైన గొంతుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో ఆయనకు డిమాండ్ పెరిగింది. ఇక తెలుగులోనూ ఛాన్స్‌లను అందుకుంటున్నాడు. ఫిబ్రవరి 4న 'బుట్టబొమ్మ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆక్సిజన్ అనే చిత్రంలోనూ కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడతడికి మరో మంచి అవకాశం వరించినట్లు తెలుస్తోంది.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న SSMB 28 చిత్రంలో నటించబోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో అతడు వైల్డ్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రతినాయకుడి పాత్ర అని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే అర్జున్ దాస్ తాజాగా నటించిన బుట్టబొమ్మ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించారు.