తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

April 2024 Tollywood Movies : 'దేవర'కు గట్టి పోటీ.. ఏప్రిల్​లో క్యూ కట్టనున్న సినిమాలు ఇవే.. - పవన్​ కల్యాణ్ ఓజీ మూవీ

April 2024 Tollywood Movies : ఈ ఏడాది మొదలుకుని వరుస సినిమాలతో బాక్సాఫీస్​ వద్ద సందడి చేస్తున్న​ స్టార్ హీరోలు వచ్చే ఏడాది కూడా భారీ సినిమాలతో ప్రేక్షకులను ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న వేసవిలో తమ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉన్నారు. దీంతో ఇండస్ట్రీలో ఇప్పటి నుంచే పోటీ వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాలు రిలీజ్​ కానున్నాయంటే..

April 2024 Tollywood Movies
April 2024 Tollywood Movies

By

Published : Aug 13, 2023, 2:02 PM IST

Updated : Aug 13, 2023, 2:14 PM IST

April 2024 Tollywood Movies : వరుస సినిమాలతో సందడి చేస్తున్న టాలీవుడ్​ స్టార్ హీరోలు వచ్చే ఏడాది కూడా తమ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది విడుదల కోసం ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో పోటీ వాతావరణం నెలకొంది. మూవీ మేకర్స్​ సైతం గ్యాప్​ లేకుండా ఆయా సినిమాల షూటింగ్​లు పూర్తి చేస్తూ వీలైనంత త్వరగా వాటిని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరోలు కూడా తమ కాల్షీట్లను నింపుకుంటూ సినిమాల చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంటున్నారు.

ఒకప్పటి కాలంలో సినిమా మెత్తం రెడీ అయ్యాకనే రిలీజ్​ డేట్​ను ఖరారు చేసి ఆడియెన్స్​కు తెలిపేవారు. ఒక్కోసారి షూటింగ్​ మధ్యలో ఉన్నప్పుడే చెప్పినప్పటికీ.. ఆయా సినిమాల షెడ్యూళ్లలో మార్పులు జరిగితే.. ఇక సినిమా రిలీజ్​ కూడా వాయిదా పడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇండస్ట్రీలో పోటీ వాతావరణం ఎక్కువ అయిపోతుంది. పైగా ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా మేనియా నడుస్తోంది. ఇతర భాషా చిత్రాలు కూడా తెలుగులో బ్లాక్​బస్టర్​ టాక్​ సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తున్నాయి. ఇక మన సినిమాలు కూడా పాన్ఇండియా లెవెల్​లో రిలీజై సత్తా చాటుతున్నాయి. దీంతో ఇటువంటి అంశాలపై దృష్టి సారిస్తున్న మేకర్స్.. తమ సినిమాల విడుదల విషయంలో తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. పక్క స్టార్స్​ సినిమాలతో క్లాష్​ అవ్వకుండా ఉండేలా చూసుకుంటున్నారు.

Devara Movie Release Date : ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది 'దేవర'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజయ్యేందుకు సిద్ధమౌతోంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్​ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 'దేవర' సినిమాకు పోటీగా ఇప్పుడు చాలా సినిమాలు రానున్నట్లు సమాచారం. లెక్కల మాస్టర్​ సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' చిత్రం కూడా ఏప్రిల్​లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సుజిత్- పవన్​ కల్యాణ్​ కాంబోలో రూపొందుతున్న 'ఓజీ' కూడా ఏప్రిల్​లోనే రానుందట.

Ram Charan Game Changer Release : ఇక మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఏప్రిల్​లోనే విడుదల కానుందని నెట్టింట టాక్​ నడుస్తోంది. ఇదిలాఉండగా.. గ్లోబల్​స్టార్ రామ్​చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాను నిర్మాత దిల్ రాజు ఏప్రిల్​లోనే రిలీజ్ చేయాలని ప్లాన్​ చేస్తున్నారట. దీంతో 'దేవర'కు గట్టి పోటీనే ఉన్నట్లు అనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్​తో రూపొందినవే. అంతేకాకుండా.. ఏప్రిల్ మే నెలల్లో వేసవి సెలవులు రానున్న తరుణంలో ఈ సినిమాల రిలీజ్​ గురించి దర్శకులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారట. దీంతో ఏ సినిమా బాక్సాఫీస్​ వద్ద నెగ్గుతుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jr NTR Devara : పులితో గేమ్ కంప్లీట్.. ఇప్పుడు సొర చేపతో 'దేవర' ఢీ!

NTR Devara movie shooting : 'దేవర' కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?​

Last Updated : Aug 13, 2023, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details