తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయంపై స్టే - ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు స్టే

AP High Court News
AP High Court News

By

Published : Jul 1, 2022, 11:36 AM IST

11:23 July 01

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

AP High Court News : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం తుది వ్యాజ్యాల విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details