తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2022, 1:40 PM IST

ETV Bharat / entertainment

'ఆచార్య' టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. పదిరోజుల పాటు రూ.50 పెంచుకునేందుకు అంగీకరించింది.

government allowed the Acharya cinema ticket price to increase
'ఆచార్య' టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Acharya Movie: చిరంజీవి- రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 29న విడుదలకానున్న ఈ చిత్ర ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్​ ప్రభుత్వం అనుమతించింది. మెగాస్టార్‌ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఆచార్య టిక్కెట్ ధరను రూ.50 పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు మాత్రమే కొత్త ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. రూ.100 కోట్ల నిర్మాణ వ్యయం దాటిన చిత్రాలకు టిక్కెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్‌ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఐదో షో విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.

మరోవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ‘ఆచార్య’ ఐదో షోతో పాటు టికెట్‌ ధరల పెంపునకు అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్తా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్‌ అథారిటీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐదో ఆటతోపాటు టికెట్‌ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్‌ కలిసి నటించిన చిత్రంకావడంతో ‘ఆచార్య’పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ధర్మస్థలి అనే ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. పూజాహెగ్డే, సోనూసూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.

ఇదీ చూడండి: చరణ్​తో పోటీ.. 'రేసుగుర్రం'లో శ్రుతిలా ఫీలయ్యా: చిరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details