తుళునాడులోని భూతకోల సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రం 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రం తర్వాత ఈ భూతకోల ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం మొదలయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు వరకు చాలా మంది దీని గురించి తెలుసుకునేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టి కుటుంబ సమేతంగా ఈ భూతకోల ఉత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళూర్లో జరిగిన భూత కోల వేడుకల్లో అనుష్క తన కుటుంబంతో కలిసి పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ కనిపించారు. పట్టుచీర కట్టుకుని ఎంతో అందంగా కనిపించారు. మరి ఇది పాత వీడియోనా లేదా కొత్తదా అనే స్పష్టం లేదు.