సెలబ్రిటీలకు ఇంటా బయటా రక్షణ చాలా అవసరం. ఎందుకంటే వారు బయట తిరుగుతున్న సమయంలో తమను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి వస్తుంటారు. అలాంటి వారిని కట్టడి చేయాలంటే స్టార్స్‌కు సాధ్యం కాని పని. అందుకే తమ ప్రొటక్షన్ కోసం తారలు బాడీగార్డులను నియమించుకుంటారు. అలా బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీకి సైతం ఓ బాడీగార్డ్ ఉన్నాడు. అతని పేరు సోనూ. ఇందులో ఏముంది వింత అనుకుంటే అక్కడే మీరు పొరబడినట్లు. అతను చేసే సేవలకు ఈ జంట భారీ మొత్తంలో జీతం ఇస్తుందట. ఆ సొమ్ము ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే మరి. సోనూకు ఈ జంట ఇచ్చే వార్షిక వేతనం సుమారు రూ. 1.2 కోట్లు అని సమాచారం.
వామ్మో.. 'విరుష్క' బాడీగార్డ్ జీతం అంతా.. తెలిస్తే షాక్! - విరాట్ కోహ్లీ బాడీగార్డ్ వార్షిక జీతం
స్టార్స్ తమ రక్షణ కోసం బాడీగార్డులను నియమించుకోవడం సహజం. ఎల్లవేళలా తమకు రక్షణగా ఆ బాడీగార్డులు ఉండేందుకు వారికి కావాల్సిన సదుపాయాలతో పాటు భారీ మొత్తాన్ని జీతంగా ఇస్తారు. ఇదే తరహాలో స్టార్ కపుల్ విరాట్ అనుష్కలకు కూడా ఓ బాడీగార్డు ఉన్నాడు. కానీ అతని వార్షిక వేతనం గురించి తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.
virat and anushka sharma bodyguard sonu
కాగా సోనూ అసలు పేరు ప్రకాష్ సింగ్. అతను ఎంతో కాలంగా వీరిద్దరి వద్దనే నమ్మకస్థుడిగా పని చేస్తున్నాడు. విరాట్‌తో పెళ్లికి ముందు కూడా సోనూ అనుష్క దగ్గరే పని చేసేవాడు. ఈ స్టార్ కపుల్ సోనూని కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేస్తారట. అంతే కాదు ఏటా అతని పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారట. గతంలో 'జీరో' సినిమా సెట్స్‌లో సోనూ పుట్టినరోజు జరిపిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి.