తెలంగాణ

telangana

ఫన్నీ ఫన్నీగా మిస్‌ శెట్టి- మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌.. మీరు చూశారా?

By

Published : Apr 29, 2023, 9:01 PM IST

Updated : Apr 30, 2023, 10:16 AM IST

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' టీజర్ తాజాగా విడుదలైంది. మరి.. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ప్రచార చిత్రాన్ని మీరు చూశారా?

Miss Shetty Mr Polishetty teaser
ఫన్ని ఫన్నీగా మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌ చూశారా?

సీనియర్ హీరోయిన్​ అనుష్క సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి దాదాపు ఐదేళ్లు అయిపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె.. మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్ష‌కులను అలరించనున్నారు. జాతి రత్నాలు ఫేమ్​ యంగ్​ హీరో నవీన్​ పొలిశెట్టితో కలిసి ఆమె నటిస్తున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్​పై వంశీ - ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్​. ఇందులో నవీన్‌ పొలిశెట్టి... సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలోనూ, కథానాయిక అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలోనూ నటించారు. వీరిద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి రధన్‌ సంగీతం అందిస్తున్నారు.

చెఫ్‌గా అనుష్క శెట్టి ఎంట్రీ ఇవ్వడంతో ప్రారంభమైందీ ప్రచార చిత్రం. 'ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు ఇట్స్ ఏ సైన్స్' అంటూ అనుష్క చెప్పిన సంభాషణతో మొదలైన ఈ టీజర్​.. ఆ తర్వాత 'నా కూతురు సామాన్యురాలు అనుకుంటున్నావా.. ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోదు' అంటూ అనుష్క గురించి ఆమె త‌ల్లిగా జ‌య‌సుధ డైలాగ్​ చెప్ప‌డం ఆస‌క్తిని పెంచింది. ఆ త‌ర్వాత సిద్ధు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా న‌వీన్ పొలిశెట్టి కనిపించి ఆకట్టుకున్నారు. తన మార్క్​ టైమింగ్ కామెడీ, పంచ్ డైలాగ్స్​తో నవ్వులు పూయించారు. టీజ‌ర్‌కు ఇవే హైలైట్‌గా నిలిచాయి.

'వాట్ ఈజ్ యువ‌ర్ స్ట్రెంత్' అన‌గానే.. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా కామెడీ చేస్తాను... 'మరీ వీక్‌నెస్ ఏంట'ని అడగగానే.. సిట్యూవేష‌న్‌కు సంబంధం లేకుండా కామెడీ చేస్తానంటూ పొలిశెట్టి చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బా నవ్వించాయి. 'మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా' అంటూ అనుష్క అడిగిన ప్రశ్నకు.. కామెడీ టైమింగ్ మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుంద‌ని టీజ‌ర్ చివ‌ర‌లో న‌వీన్ పొలిశెట్టి చెప్పడం.. మరింత నవ్వించింది. మొత్తంగా మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి టీజ‌ర్‌.. అనుష్క అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్​ను ఆక‌ట్టుకుంటోంది.

కాగా, ఈ సినిమాకు మ‌హేష్‌బాబు. పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైరెక్టర్​గా ఆయనకు ఇది రెండో సినిమా. గ‌తంలో సందీప్‌కిష‌న్‌తో రారా కృష్ణ‌య్య అనే సినిమా చేశారు. అనుష్క హీరోయిన్‌గా ఇది 48వ సినిమా. న‌వీన్ పొలిశెట్టికి హీరోగా మూడో సినిమా ఇది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదీ చూడండి:నా 25ఏళ్ల కెరీర్‌లో 'శాకుంతలం' పెద్ద జర్క్‌: దిల్‌రాజు

Last Updated : Apr 30, 2023, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details