Anushka Naveen Polishetty : టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ అనుష్కశెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. అనుష్కశెట్టి చెఫ్‌గా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడటం వల్ల ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
Anushka Shetty Prank Call To Naveen Polishetty : అయితే హీరో నవీన్ పొలిశెట్టి ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే అక్కడే ఫోన్ కాల్ ద్వారా సినీ ప్రియులతో ముచ్చటించారు. ఈ సమయంలోనే అనుష్క శెట్టి ఓ ప్రాంక్ కాల్ చేసి నవీన్ పోలిశెట్టిని ఆటపట్టించింది. తాను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానంటూ చెప్పి... 'మీరు మంచి స్టాండప్ కమెడియన్ కదా. మా ఇంటిలో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో మీరు కామెడీ చేయాలి. మీరు మా ఫంక్షన్‌లో కామెడీ చేస్తారా?' అంటూ నవీన్ పోలిశెట్టిని అనుష్క శెట్టి అడిగింది.
అనుష్క అడిగిన ప్రశ్నకు నవీన్ పొలిశెట్టి బదులిస్తూ.. 'ఫంక్షన్ ఎక్కడ? బెంగళూరులోనా? ఏం ఫంక్షన్ అది' అని తిరిగి అడిగారు. 'మా సిస్టర్ బ్రదర్ అంకుల్ వాళ్ల కూతురు పెళ్లి ఉంది' అంటూ అనుష్క ఫన్నీగా సమాధానం చెప్పింది. అంతేకాకుండా 'మీరు పెళ్లికి సంబంధం లేకుండా కామెడీ చేయాలి అంటూ అనుష్క నవ్వులు పూయించింది. అందుకు నవీన్.. 'ఇంతకు మీ పేరు చెప్పండి' అంటూ అడగడం.. అందుకు అనుష్క 'నా పేరు ఎందుకులే 'అంటూ దాటవేసే ప్రయత్నం చేయడం అంతా ఫన్నీ ఫన్నీగా సంభాషణ సాగింది.