తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాతిరత్నం కోసం చెఫ్​గా మారిన అనుష్క.. ఫస్ట్​లుక్​ పోస్టర్​ రిలీజ్​ - చెఫ్​గా మారిన అనుష్క శెట్టి

నవీన్​ పొలిశెట్టితో కలిసి హీరయిన అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా మూవీటీమ్​ స్పెషల్​ విషెస్​ తెలుపుతూ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఇందులో స్వీటి చెఫ్​ లుక్​లో కనిపించి ఆకట్టుకుంది.

Anushka As chef in Naveen polishetty movie
జాతిరత్నం కోసం చెఫ్​గా మారిన అనుష్క

By

Published : Nov 7, 2022, 4:51 PM IST

దక్షిణాది స్టార్ హీరోయిన్​ అనుష్క శెట్టి.. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. అయితే కొంతకాలంగా సినిమాల విషయంలో జోరు తగ్గించినా ఈమె ప్రస్తుతం.. యూవీ క్రియేషన్స్ బ్యానర్​లో ఓ సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మహేష్.పి డైరెక్ట్ చేస్తున్నారు. నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అనుష్క ఫస్ట్​లుక్ పోస్టర్​ను రిలీజ్​ చేసి బర్త్​డే విషెస్​ తెలిపింది.

ఇందులో అనుష్క చెఫ్ గెటప్​లో వంట చేస్తూ కనిపించింది. సినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

జాతిరత్నం కోసం చెఫ్​గా మారిన అనుష్క

ఇదీ చూడండి:అనుష్క పోషించిన టాప్​ 7 ఐకానిక్​ రోల్స్​ ప్రేక్షకులకు ఇవి ఎంతో స్పెషల్​

ABOUT THE AUTHOR

...view details