నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిఖిల్ కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని తాను చూస్తున్నానని, ఆయనంటే తనకెంతో ఇష్టమని చెప్పిన మహేశ్ అనే అభిమానికి హీరో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనపై అమితమైన ప్రేమను చూపిస్తోన్న ఆ అభిమానిని స్టేజ్ పైకి పిలిచి.. తన కళ్లద్దాలను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని ఈవెంట్ అనంతరం మహేశ్ ట్విటర్ వేదికగా షేర్ చేయగా దానిపై నిఖిల్ స్పందిస్తూ.. "బ్రో.. ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాపై చూపించిన ప్రేమకు నేనిచ్చిన గిఫ్ట్ అది" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే ఓ సరదా సన్నివేశం జరిగింది. ఏడో తరగతి నుంచి తనను అభిమానిస్తున్నట్లు ఆ ఫ్యాన్ చెప్పడం వల్ల అతడికి హగ్ ఇస్తా రమ్మంటూ హీరో నిఖిల్ పిలిచారు. దీంతో స్టేజీపైనే ఉన్న నటుడు శ్రీనివాస రెడ్డి.. తాను అనుపమ అభిమాని అని, ఏడో తరగతిలో ఉండగా ఆమె నటించిన 'ప్రేమమ్' చూసినట్లు చెప్పి నవ్వులు పూయించారు. దీంతో అనుపమ లేచి ఆయనకు హగ్ ఇచ్చినట్లుగా సంజ్ఞ చేయడం అలరిస్తోంది.