భాషలకు అతీతంగా సక్సెస్ఫుల్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్‌బాస్. అన్ని రాష్ట్రాల్లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ షోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. అందులో పాల్గొనాలని చాలా నటీనటులు అనుకుంటారు. ఈ షోకు ఎంపికైతే తమ.. వ్యక్తిగత, వృత్తిపరమైన జాతకాలు మారిపోతాయని భావిస్తుంటారు. అలా మారిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు.
అన్ని భాషల్లో చూసుకుంటే.. ఎన్నో జంటలను కలిపింది బిగ్‌బాస్ హౌస్. చాలా మంది హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా.. తమ రిలేషన్‌షిప్‌ను కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేసిన ఓ జంట.. తాజాగా బ్రేక్ చెప్పేసుకుంది. తమిళ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన జంటల్లో లోస్లియా- కవిన్ ఒకటి. తెరపై ఎంతో అన్యోనంగా కనిపించిన ఈ జంట.. బ్రేకప్ చెప్పేసుకున్నారు. తమిళనాడులో న్యూస్ రీడర్(యాంకర్)గా లోస్లియా చాలా పాపులర్. తాజాగా ఈ విషయంపై లోస్లియా స్పందించింది.
"బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాకు, కవిన్‌కు మధ్య తెలియని ఆకర్షణ ఉన్న మాట నిజమే" అని చెప్పింది లోస్లియా. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా తాము ప్రేమికులుగా కొనసాగినట్లు పేర్కొంది. అయితే ఈ ప్రయాణంలో తమ లక్ష్యాలు వేరువేరని తెలుసుకున్నట్లు వివరించింది. అందుకే బ్రేకప్ అనివార్యం అయిపోయిందని చెప్పింది లోస్లియా.