Annapoorani Movie Controversy : సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. ఆమె కెరీర్లోనే బెంచ్‌మార్క్ చిత్రంగా 'అన్నపూరణి - ది గాడెస్ ఆఫ్ ఫుడ్' చిత్రం గతేడాది డిసెంబరు 1న రిలీజ్ అయింది. నయన్ 75వ సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి రిలీజ్ రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఈ చిత్రం థియేటర్స్‌లో అంతగా మెప్పించలేక పోయింది. అయితే ఇప్పుడు ఆమెకు మళ్లీ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అదేంటంటే అన్నపూరణి(Annapoorani Movie)పై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి చిత్రాన్ని తొలగించేసింది.
అసలేం జరిగిందంటే? - ఈ చిత్రాన్ని దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కించారు. సత్యరాజ్, జై ముఖ్య పాత్రలు పోషించారు. ట్రెడిషనల్ ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథతో దీనిని తెరకెక్కించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది. అయితే ఇందులోని కొన్ని సీన్స్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేశ్ సోలంకి అనే వ్యక్తి - నయనతారతో పాటు మూవీటీమ్పై కేసు పెట్టాడు. ఈ కారణంగానే చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని వివరణ చెప్పుకొచ్చింది. తమ సినిమా వల్ల ఇబ్బంది పడిన వారిని క్షమించమని కోరింది.