Animal Sequel Release Date :ఇటీవలే విడుదలైన యానిమల్ మూవీ ఎటువంటి సెస్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారూతూ సెస్సేషన్ క్రియేట్ చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా తన మార్క్ డైరెక్షన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు అందుకుంటుండగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ.400 కోట్ల మార్క్ దాటి రికార్డుకెక్కింది.
ఇక మూవీ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గురించి నెట్టింట డిస్కషన్ మొదలెట్టారు. అలా మూవీ క్రెడిట్స్‌లో డైరెక్టర్ హింట్ ఇచ్చిన సీక్వెల్ గురించి వివరాలు బయటపడ్డాయి. 'యానిమల్ పార్క్ కమ్ విజిట్ సూన్' అని ఎండ్ కార్డ్‌పై రాసుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనున్నట్లు ఇట్లే స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ రిలీజ్ ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారు నెటిజన్లు. యానిమల్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కీలకమని అది వస్తే తాను, రణబీర్ కలిసి ఇంకో ఐడియాను వర్క్ అవుట్ చేస్తామని సందీప్ అన్నారు. యానిమల్తో పోలిస్తే అది చాలా డార్క్‌గా ఉంటనుందని హింట్ ఇచ్చారు. వాళ్లిద్దరికి ఆ రకమైన కాన్ఫిడెంట్ ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నామని సందీప్ వెల్లడించారు. ఇది కచ్చితంగా సీక్వెల్ అప్డేట్ అని అనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు కథ సిద్ధంగా ఉందని, త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి 2025 కల్లా విడుదలకు సిద్ధమవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక అప్డేట్ రాలేదు.