Animal Pre Release Event :తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా 'యానిమల్'. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టాహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా వచ్చారు. సినిమా నటీనటులు, టెక్నీషియన్స్‌తో పాటు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. ఒక నాన్ తెలుగు హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత మంది రావడం ఇదే తొలిసారి కావచ్చు అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు.
టీజర్ చూస్తే మెంటలొచ్చింది : మహేశ్
Animal Pre Release Event Mahesh Babu Speech :యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ బాబు.. సినిమాను పొగిడారు. ముఖ్యంగా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మెంటలొచ్చిందని చెప్పారు. 'యానిమల్ ట్రైలర్ చూసాను.. మెంటలొచ్చేసింది. ఇలాంటి ఒరిజినల్ ట్రైలర్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. సందీప్ దేశంలోనే ఒరిజినల్ ఫిలిం మేకర్లలో ఒకరు'' అంటూ కొనిడాడారు. ఈ వేడుక ప్రీరిలీజ్ లా లేదని.. 100రోజుల ఈవెంట్‌లా ఉందన్నారు. దేశంలో రణ్‌బీర్ బెస్ట్ నటుడు అని పొగిడేశారు.