తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అది నేను ఊహించలేదు - రణ్​బీర్​తో నా రిలేషన్​షిప్​ అలాంటిది' - యానిమల్ మూవీ అప్​డేట్స్

Animal Movie Sandeep Reddy Vanga : 'యానిమల్' మూవీ సక్సెస్​ను ఆస్వాదిస్తున్న డైరెక్టర్​ సందీప్​ రెడ్డి వంగా తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అంతే కాకుండా రణ్​బీర్​తో తనకు ఏర్పడ్డ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Animal Movie Sandeep Reddy Vanga
Animal Movie Sandeep Reddy Vanga

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 9:27 PM IST

Animal Movie Sandeep Reddy Vanga :'యానిమల్' మూవీ విడుదలై ఇప్పటికీ 20 రోజులు అవుతున్నప్పటికీ ఆ సినిమాకు థియేటర్లలో ఏ మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ అంతటి పాపులారిటి సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం యూత్​ను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఇటువంటి యాక్షన్​ థ్రిల్లర్​ను తెరకెక్కించిన డైరెక్టర్​ సందీప్​ రెడ్డిపై అందరి ఫోకస్ పడింది. ఆయన్ను నెట్టింట ఆడియెన్స్ తెగ కొనియాడుతున్నారు. అర్జున్​ రెడ్డితోనే ఆయన మార్క్​ ఏంటో చూపించిన సందీప్ 'యానిమల్​'తో తనలోని ట్యాలెంట్​ను మరింతగా చూపెట్టారంటూ కితాబులిస్తున్నారు. అయితే మూవీ రిలీజ్​కు ముందు నుంచే ప్రమోషన్స్​లో చురుగ్గా ఉన్న ఈ స్టార్​ డైరెక్టర్​, మూవీ సక్సెస్ తర్వాత కూడా మరిన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ 'యానిమల్​' గురించి ఆసక్తికర విశేషాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన హీరో రణ్‌బీర్‌ కపూర్‌, సినిమా కలెక్షన్స్‌ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"రాక్‌స్టార్‌, 'సంజు' సినిమాల్లో రణ్‌బీర్‌ యాక్టింగ్​కు నేను ఫ్యాన్​ను అయిపోయాను. దీంతో 'యానిమల్‌'లో హీరోగా రణ్‌బీర్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. 'కబీర్‌ సింగ్‌' సినిమా కంప్లీట్​ అయ్యాక ఈ స్టోరీని తెరకెక్కించాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఇందులోని హీరో పాత్ర రాస్తుంటే నాకు రణ్‌బీర్‌ మాత్రమే మైండ్‌లోకి వచ్చేవారు. దీంతో కొన్ని నెలల తర్వాత ఆయన్ను కలిసి పది నిమిషాల పాటు స్క్రిప్టు వినిపించాను. ఇక వెంటనే ఆయన సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత మేమిద్దరం మరోసారి కలిశాం. అప్పుడు నేను మూడున్నర గంటల పాటు పూర్తి కథ చెప్పాను. ఈ మూవీ జర్నీలో మేమిద్దరం చాలా క్లోజయ్యాం. ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. అని రణ్​బీర్​తో తన అనుబంధాన్ని పంచుకున్నారు.

మరోవైపు ఈ సినిమకు వస్తున్న విశేషాదణతో పాటు కలెక్షన్స్​ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తుందని సుమారు రూ.700 కోట్లు వసూళ్లు చేస్తుందని ఆయన ముందు నుంచీ అనుకున్నారని తెలిపారు. కానీ, రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్‌ అందుకున్నదని. ఈ విషయాన్ని ఆయన ఊహించలేదంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మెగాస్టార్​ చిరంజీవితో యాక్షన్​ సినిమా చేస్తా : 'యానిమల్​' డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా

'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్​పై సందీప్ ఫైర్!

ABOUT THE AUTHOR

...view details