Animal Movie Run Time :బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - రష్మిక మందన్నా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం 'యానిమల్'. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి ఫేమ్' సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం.. డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
'యానిమల్' సినిమా రన్‌టైమ్ దాదాపు 3.20 గంటలు (200 నిమిషాలు) ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే అత్యధిక రన్టైమ్తో కూడిన బాలీవుడ్ సినిమా ఇదే కానుంది. అయితే ఇదివరకూ 'ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2016లో రిలీజైన ఈ సినిమా దాదాపు 3.10 గంటల నిడివి కలిగి ఉంది. ఇక టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
Unstoppable With NBK Season 3 Ranbir Kapoor : ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మూవీటీమ్ రీసెంట్గా తెలుగు టాక్ షో అన్స్టాపబుల్కు హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ట్విట్టర్లో ప్రకటించింది. ఈ బిగ్గెస్ట్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ట్విట్టర్ వేదికగా తెలిపింది. 'డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్లోనే వైల్డెస్ట్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి ప్రసారం కానుంది' అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్లో హీరో రణ్‌బీర్‌తోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు.