తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మూవీ ప్రమోషన్స్​లో సందడి - రణ్​బీర్​కు తెలుగు నేర్పించిన రష్మిక! - రణ్​బీర్​కు తెలుగునేర్పించి రష్మిక

Animal Movie Promotions : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'యానిమల్'. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ షోకు వెళ్తున్న రష్మిక, రణ్​బీర్ సందడి చేశారు. ఆ వీడియోలను మీరూ ఓ లుక్కేయండి..

Animal Movie Promotions
Animal Movie Promotions

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 6:29 PM IST

Animal Movie Promotions : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ - నేషనల్​ క్రష్​ రష్మిక మందన్నా లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన తాజా చిత్రం 'యానిమల్'. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి ఫేమ్' సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్​ ఎంటర్​టైనర్​ జోనర్​లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను డిసెంబర్​ 1 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది.

తాజాగా ముంబయిలోని ఓ పాపులర్ సింగింగ్ ప్రోగామ్​ షూట్​లోనూ రణ్​బీర్, రష్మిక మెరిశారు. స్టూడియోలోకి వెళ్లేముందు సెట్స్​లో కలియతిరుగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ రిపోర్టర్​.. రణ్​బీర్​ను తెలుగులో మాట్లాడాలని అడిగారు. దీంతో వెంటనే స్పందించిన రణ్​బీర్​.. "అందరికీ నమస్కారం" అంటూ చెప్పారు. ఇంకా మాట్లాడాలని అడిగే సరికి.. పక్కనే ఉన్న రష్మిక ఆయనకు సాయం చేసింది. "నేను బాగున్నాను.. మీరు బాగున్నారా" అంటూ రణ్​బీర్​తో చెప్పించింది. అలానే కన్నడ కూడా నేర్పించింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Unstoppable With NBK Season 3 Ranbir Kapoor : ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న మూవీటీమ్.. రీసెంట్​గా తెలుగు టాక్ షో అన్​స్టాపబుల్​కు వచ్చారని ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా ట్విట్టర్​లో ప్రకటించింది. ఈ బిగ్గెస్ట్​ ఎపిసోడ్​ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ట్విట్టర్​ వేదికగా తెలిపింది. 'డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్​లోనే వైల్డెస్ట్ ఎపిసోడ్ నవంబర్ 24 నుంచి ప్రసారం కానుంది' అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్​లో హీరో రణ్​బీర్​తోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్​ ప్రోమో వచ్చినప్పటి నుంచి.. బాలీవుడ్ హీరోతో బాలయ్య ఏం మాట్లాడారు? వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా సాగాయి? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అంటూ ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది.

'అన్​స్టాపబుల్​' సెట్​లో రణ్​బీర్​, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్

'యానిమల్' రన్​టైమ్ 3.20 గంటలు! - బాలీవుడ్​లో ఇదే లాంగెస్ట్ మూవీ బాస్!

ABOUT THE AUTHOR

...view details