Animal Movie Day 2 Collections :భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తోంది 'యానిమల్' మూవీ . సందీప్ రెడ్డి వంగా మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమా అటు విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్ అందుకుని దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 236 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని 'యానిమల్' మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
మరోవైపు ఈ సినిమా గురించి నెట్టింట హిట్ టాక్ వినిపిస్తున్నప్పటికీ అక్కడక్కడ నెగిటివిటీ కూడా చెలరేగుతోంది. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాలో రణ్‌బీర్ నటనకు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ షేడ్స్‌లో నట విశ్వరూపాన్ని చూపించారంటూ ఈ బాలీవుడ్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన క్యారెక్టర్‌కు 100 పర్సెంట్ న్యాయం చేశారంటూ రణ్‌బీర్‌ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇక రష్మిక, అనిల్ కపూర్, బాబీ దేఓల్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
Animal Movie Sequel Update : మరోవైపు ఈ సినిమా అటు సెంటిమెంట్‌తో పాటు వయోలెన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనుందని డైరెక్టర్ రివీల్ చేశారు. దీంతో రానున్న 'యానిమల్ పార్క్'పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇదే టాక్ కొనసాగితే యానిమల్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.