Animal Movie Day 1 Collections :తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ-బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'యానిమల్' మూవీ తొలి రోజు మంచి కలెక్షన్లు అందుకుని దూసుకెళ్తోంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కేవలం ఇండియాలోనే సుమారు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తెలుగులో రూ.10 కోట్లు, హిందీలో రూ.50 కోట్లు, కన్నడ, తమిళం, మలయాళంతో కలిపి మొత్తంగా ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిందట.
Animal Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ దేఓల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను పెంచారు. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. అక్కడక్కడ నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికీ.. అవేవి నిజం కావంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
Animal Movie Sequel Update : మరోవైపు ఈ సినిమా అటు సెంటిమెంట్‌తో పాటు వయోలెన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనుందని డైరెక్టర్ రివీల్ చేశారు. దీంతో రానున్న 'యానిమల్ పార్క్'పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ఇదే టాక్ కొనసాగితే యానిమల్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.