Animal Movie Box Office Collection: రణ్‌బీర్ కపూర్ - సందీప్‌రెడ్డి వంగా కాంబోలో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం (డిసెంబర్ 1) విడుదలైన ఈ సినిమా వీకెండ్లో హౌస్‌ఫుల్ షోస్‌తో సందడి చేసింది. తొలి రెండు రోజులు రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకున్న యానిమల్, మూడో రోజు కూడా కాసుల వర్షం కురిపించింది. 3 రోజులు కలుపుకొని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 356 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది. ఈ కలెక్షన్ వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇక ఆదివారం ఒక్క రోజే ఈ సినిమా రూ. 120 కోట్లు వసూల్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 'యానిమల్' రోజువారి కలెక్షన్లు..
- తొలి రోజు - రూ.116 కోట్లు
- రెండో రోజు - రూ. 120 కోట్లు
- మూడో రోజు - రూ. 120 కోట్లు
సినిమాలో హీరో రణ్‌బీర్‌కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమాలో రణ్‌బీర్, రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండ్రీ కుమారుల సెంటిమెంట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. ఇక ఈ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది. హిందీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కింది.