తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ. 500 కోట్లు క్రాస్ - బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ర్యాంపేజ్ - యానిమల్ సినిమా నటీనటులు

Animal Movie Box Office Collection : రణ్​బీర్ కపూర్ - సందీప్​రెడ్డి వంగా కాంబోలో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం ఆరు రోజుల్లో కలిపి ఈ సినిమా రూ. 500 కోట్ల మార్క్ అందుకుంది.

animal movie box office collection
animal movie box office collection

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 6:56 PM IST

Updated : Dec 8, 2023, 12:46 PM IST

Animal Movie Box Office Collection : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్) లోనూ హౌల్​ఫుల్​ షోస్​తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఆరు రోజులు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ. 527.6 కోట్లు వసూల్ చేసింది. ఈ కలెక్షన్ వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే రిలీజైన తర్వాత వరుసగా మూడు రోజుల్లో రూ. 100 కోట్లు వసూల్ చేసిందీ సినిమా. ఇక వీకెండ్ తర్వాత కాస్త జోరు తగ్గినట్లు అనిపించినా, ఆరు రోజుల్లోనే రూ. 500 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. కాగా, ఆరో రోజైన బుధవారం ఒక్క హిందీలోనే రూ. 27.8 కోట్ల కలెక్షన్లు సాధించింది.

రోజువారీ కలెక్షన్లు (ప్రపంచవ్యాప్తంగా)..

  • తొలి రోజు - రూ.116 కోట్లు
  • రెండో రోజు - రూ. 120 కోట్లు
  • మూడో రోజు - రూ. 120 కోట్లు
  • నాలుగో రోజు - రూ .69 కోట్లు
  • ఐదో రోజు - రూ. 56 కోట్లు
  • ఆరో రోజు - రూ. 46 కోట్లు

సినిమాలో హీరో రణ్​బీర్​కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమాలో రణ్​బీర్, రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండ్రీ కుమారుల సెంటిమెంట్​తో దర్శకుడు సందీప్​రెడ్డి సినిమాను ఇంకో లెవెల్​కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. ఇక ఈ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది. హిందీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కింది.

Animal Movie Cast : ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీకొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాలో రణ్​బీర్​ కపూర్​తో పాటు రష్మిక మందన్న, తృప్తీ దిమ్రి, బాబీ దేఓల్​, అనిల్‌ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి తన మార్క్ డైరెక్షన్​తో ఈ సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల్లో మరింత హైప్​ను పెంచారు. ​మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది.

2025లో 'యానిమల్​ పార్క్' - ఆ ఫీడ్​బ్యాక్​ కోసం డైరెక్టర్​ వెయిటింగ్​!

'యానిమల్'​ మూవీలో సుందరమైన ప్యాలెస్​ - ఆ స్టార్​ హీరోదేనట

Last Updated : Dec 8, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details