తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్​పై సందీప్ ఫైర్! - యానిమల్ సినిమా వసూళ్లు

Animal Director Sandeep Reddy Vanga : బాక్సాఫీస్ వద్ద యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్​పై ఆయన ఫైర్​ అయ్యారు.

Animal Director Sandeep Reddy Vanga
Animal Director Sandeep Reddy Vanga

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 12:34 PM IST

Animal Director Sandeep Reddy Vanga Counter : యానిమల్​ మూవీతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టేశారు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్​బీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై 19రోజులు దాటినా కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం యానిమల్ సక్సెస్ మోడ్​లో ఉన్న సందీప్ రెడ్డి వంగా కంటిన్యూగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీ విమర్శకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కొంతమంది క్రిటిక్స్​కు సినిమాలపై అవగాహన లేకుండానే రివ్యూలు ఇస్తున్నట్లు ఆరోపించారు సందీప్​ రెడ్డి. గత ఐదేళ్లుగా ముంబయిలో ఉండడం వల్ల తనకు ఓ విషయం అర్థమైందని చెప్పారు. బీటౌన్​లో ఓ సినీ క్రిటిక్స్ టీమ్​ ఉందని, వారికి కొన్ని సినిమాలు మాత్రమే నచ్చుతాయని ఆరోపించారు. మిగతా సినిమాలకు బ్యాడ్ రివ్యూలు ఇస్తారని ఆరోపణలు చేశారు. అర్జున్ రెడ్డి మూవీ విషయంలో ఇదే జరిగిందని తెలిపారు. సినీ క్రిటిక్స్​కు డబ్బులు ఇచ్చే సంస్కృతి సినీ ఇండస్ట్రీలో ఉందని, కానీ తాను అలా ఎప్పుడూ చేయలేదని వెల్లడించారు.

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు. త్రప్తి డిమ్రీ ప్రధాన పాత్ర పోషించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యానిమల్ మూవీ 19 రోజుల్లో రూ.850 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

sandeep vanga upcomning movies: ఇప్పుడు సందీప్ కొత్త ప్రాజెక్ట్​ల కోసం సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది. మూడు సినిమాలకు ఆయన ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా ఇప్పటికే సందీప్ కమిట్ కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సూపర్ స్టార్ మహేశ్​తో కూడా సినిమాలు చేయనున్నట్లు సమాచారం. వీటి తర్వాత యానిమల్ సినిమాకు సీక్వెల్ అయిన యానిమల్ పార్క్‌ను తెరకెక్కించాలని భావిస్తున్నారట.

బాక్సాఫీసు ముందు 'యానిమల్' ర్యాంపేజ్​- రూ.660 కోట్లు దాటిన కలెక్షన్స్

మెగాస్టార్​ చిరంజీవితో యాక్షన్​ సినిమా చేస్తా : 'యానిమల్​' డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా

ABOUT THE AUTHOR

...view details