టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారుఓ వైపు సలార్, మరోవైపు ప్రాజెక్ట్ కె, ఇలా కొన్ని భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ఈ బాహుబలి స్టార్.. అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్' సినిమాకు సైన్ చేశారు. అప్పట్లో ఈ వార్తల విన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఈ కాంబో ఎటువంటి సినిమాను తెరకెక్కిస్తుందో అని భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కాగా ప్రభాస్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు అభిమానులు. గతంలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది.
'ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి మరి' - ప్రభాస్‌తో సందీప్ వంగా మూవీ
అర్జున్ రెడ్డి సినిమాతో తెరంగేట్రం చేసిన స్టార్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూన్ చెప్పారు సందీప్. అదేంటంటే...
అయితే తాజాగా వచ్చిన సమచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో షూట్‌కు వెళ్లే ఛాన్స్ లేదట. ఎందుకంటే అటు ప్రభాస్.. ఇటు సందీప్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ మూవీ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం తీసుకోనుందట. కాగా నిర్మాత భూషణ్ కుమార్ మాత్రం సినిమా షూట్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్.. 'స్పిరిట్' గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ఇచ్చారు. ప్రస్తుతం 'యానిమల్' సినిమా షూట్లో బిజీగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ మూవీని పట్టాలెక్కించే పనిలో పడిపోనున్నారట. అంతే కాకుండా ప్రభాస్ సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నందున ఆయన ఈ సినిమాను ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కు మించి తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.