తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'తొలి వారంలో రూ.40కోట్లు నష్టపోయాం'- వసూళ్లపై యానిమల్​ నిర్మాత కీలక వ్యాఖ్యలు - యానిమల్​ ఓటీటీ న్యూస్

Animal Collection Till Now : యానిమల్ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందన్నారు నిర్మాత ప్రణయ్​. ఆ ఒక్క విషయం వల్లే మొదటి వారంలో తాము సుమారు రూ.40 కోట్లు నష్టపోయామని చెప్పారు.

animal collection total
animal collection total

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 10:23 PM IST

Animal Collection Till Now : యానిమల్‌ సినిమా వసూళ్లపై చిత్ర నిర్మాణ ప్రణయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తమ చిత్రం సుమారు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందన్నారు. వసూళ్ల విషయంలో తాము వాస్తవాలనే చెబుతున్నామని అందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు. అయితే, మొదటి వారంలో రూ.40 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించారు.

"యానిమల్​ సినిమా ఇంకా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరలేదు. డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పిన లెక్కల ప్రకారం మొదటి వారంలో థియేటర్లు లభించకపోవడం వల్ల దాదాపు రూ.40 కోట్లు నష్టపోయాం. లాంగ్‌ వీకెండ్‌ లేకపోవడం, 3.21 గంటల నిడివి, ఎ సర్టిఫికేట్‌ సినిమా కావడం, అదే సమయంలో సామ్‌ బహాదుర్‌ విడుదల కావడం ఇవన్నీ కూడా కారణాలే. మా చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులకు ఆసక్తి ఉన్నా థియేటర్లు సరిగ్గా లభించలేదు. దీంతో తొలి వారంలో కలెక్షన్స్‌ కాస్త తక్కువగా వచ్చాయి.

నిడివి ఎక్కువగా ఉందని ఎవరూ ఇబ్బందిపడలేదు. కానీ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ గురించి చాలా మంది అంసతృప్తి వ్యక్తం చేశారు. విషయం ఏదైనా సరే అందర్నీ సంతృప్తి పరచడం సాధ్యపడదు. ప్రస్తుతం సందీప్‌ యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌ కోసం పని చేస్తున్నాడు. ఓటీటీలో కొత్త సీన్స్‌ యాడ్‌ చేయాలా? వద్దా? అనేది ఆలోచిస్తున్నాం. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం సెన్సార్ పూర్తయ్యాకే తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను రిలీజ్​ చేయాల్సి ఉంటుంది. కొత్త సీన్స్‌ యాడ్‌ చేసి మరోసారి సెన్సార్‌కు వెళ్లాలా? లేదా థియేటర్‌ వెర్షన్‌లోనే విడుదల చేయాలా? అనేది చూస్తున్నాం."
--ప్రణయ్‌ యానిమల్ నిర్మాత

బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌- రష్మిక మంధాన్న జంటగా సందీప్‌ రెడ్డి వంగా తీర్చిదిద్దిన చిత్రం యానిమల్‌. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. టీ సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలైంది. యానిమల్‌కు సీక్వెల్‌గా యానిమల్‌ పార్క్‌ చేయనున్నట్లు సందీప్‌ ఇప్పటికే ప్రకటించాడు. అయితే, సీక్వెల్‌కు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రభాస్‌తో చేయనున్న స్పిరిట్‌ పనుల్లో సందీప్‌ త్వరలో బిజీ కానున్నారని, ఆ ప్రాజెక్ట్‌ పూర్తైన తర్వాతే ఆయన యానిమల్‌ పార్క్‌ను రూపొందిస్తారని ప్రణయ్‌ చెప్పారు.

ఒక్క దెబ్బతో అన్నయ్య లైఫ్​ సెట్​ చేసిన సందీప్- అప్పుడు 32ఎకరాలు అమ్మేసినా!

'నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను కూడా'- సినీ క్రిటిక్స్​పై సందీప్ ఫైర్!

ABOUT THE AUTHOR

...view details