Anil ravipudi upcoming movies : ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. స్టార్స్‌తో ఫన్ చేయించడం ఆయన ప్రత్యేకత. ఇండస్ట్రీలో ఆయనకు మంచి డిమాండ్ ఉంది. అభిమానుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడ అల్లరి. తనదైన స్టైల్లో కామెడీ పంచ్‌లతో సిల్వర్స్క్రీన్పైనే కాకుండా.. బయటకు కూడా పక్కనవారిని తెగ నవ్వించేస్తుంటారు. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా.. వేరే చిత్రాల ప్రమోషన్స్.. ఇంటర్వ్యూస్, షోస్ అంటూ.. తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టిస్తుంచారు.
Balayya Anil ravipudi movie : ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ పవర్ ఫుల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన మార్క్ ఫన్ ఎంటర్టైన్మెంట్కు బాలయ్య మాస్ట్ యాక్టింగ్‌ను జతచేస్తూ భారీ స్థాయిలో డిఫరెంట్‌గా చిత్రాన్ని చేస్తున్నారు. 'భగవంత్ కేసరి' పేరుతో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.
Anil ravipudi chiranjeevi : అయితే ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా ఏంటనే విషయమై అభిమానుల్లో ఇప్పుడు నుంచే ఆసక్తి మొదలైంది. దీని గురించే చాలా మంది సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనిల్ రావిపూడి సీనియర్ హీరోల్లో వెంకటేశ్‌తో కలిసి 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' అంటూ రెండు చిత్రాలు చేశారు. ఇప్పుడు బాలయ్యతో 'భగవంత్ కేసరి' చేస్తున్నారు. ఇంకా మిగిలింది.. కింగ్ నాగార్జున - మెగాస్టార్ చిరంజీవి.