Anil Ravipudi New Movie : దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే పేరు వినిపిస్తోంది. అందుకు కారణం 'భగవంత్ కేసరి'. తాజాగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్‌తో అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. చిత్రంలో ఆడపిల్లల గురించి మంచి సోషల్ మెసేజ్ ఉండడం వల్ల అనిల్ పేరు మార్మోగిపోతుంది.
తన తొలి చిత్రంతోనే పటాస్ అనిపించిన అనిల్ రావిపూడి... సినిమాలో ఫన్ అయినా ఫ్రస్ట్రేషన్ అయినా మంచిగా చూపిస్తూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తారు. తెరపై హీరోయిజాన్ని ఆవిష్కరించడంలోనూ సరిలేరు నీకెవ్వరు అనేంతగా ప్రభావం చూపించారు. అందుకే తక్కువ సమయంలో స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి యాడ్ అయిపోయిన అనిల్... ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరితోనూ మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రం అభిమానులకు చాలా చాలా నచ్చేసింది. అప్పుటివరకు కామెడీ ట్రాక్‌తో హిట్లను అందుకున్న అనిల్.. తొలిసారి సమాజానికి ఉపయోగపడే సోషల్ మెసేజ్ ఇచ్చి అభిమానుల మనసును తాకారు.
Anil Ravipudi Raviteja Movie : దీంతో అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఆయన ఏ హీరోతో సినిమాను చేయబోతున్నారు? ఎలాంటి కథతో రానున్నారు? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ మళ్ళీ తనకు హిట్ ఇచ్చిన హీరోతోనే సినిమాకు కమిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ మాహారాజా రవితేజతో మరో సినిమాకు కమిట్ అయినట్లు ప్రచారం ఎక్కువ సాగుతోంది.