తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ట్రెండీ టైటిల్​తో బాలయ్య!.. ట్రైలర్స్​తో కుర్ర హీరోల జోరు - chor bazaar

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ, ఆకాశ్​ పూరి, సత్యదేవ్ కొత్త చిత్రాల విశేషాలున్నాయి.

Nanadamuri Balakrishna
anil ravipudi balakrishna movie

By

Published : Jun 9, 2022, 4:51 PM IST

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన సంగతి తెలిసిందే. బాలయ్య 108 చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుంది. అయితే, ఈ చిత్రానికి ఏం టైటిల్‌ పెట్టనున్నారనే విషయంలో గత కొంతకాలంగా అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో పలు ఆసక్తికరమైన పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా పేరు ఇదే అంటూ గతంలో చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో టైటిల్‌ తెరపైకి వచ్చింది.

సినిమాలో బాలయ్య వ్యక్తిత్వానికి తగ్గట్టుగా 'బ్రో.. ఐ డోంట్‌ కేర్‌' అనే టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం టైటిల్‌ అనౌన్స్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో బాలయ్యకు కుమార్తెగా శ్రీలీల నటించనుంది. ప్రియమణి, అంజలి కీలకపాత్రలు పోషిస్తారని సమాచారం. అక్టోబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మధ్య వయస్కుడైన తండ్రీ -కూతుళ్ల మధ్య అనుబంధాలను ఈ సినిమాలో చూపిస్తామని దర్శకుడు ఇప్పటికే చెప్పారు.

ట్రైలర్​ విడుదల చేసిన బాలయ్య: దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు, ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్‌ బజార్‌'. జీవన్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. కమర్షియల్‌ హంగులతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. ఆకాశ్‌ లుక్స్‌, 'బచ్చన్‌సాబ్‌' అంటూ తన పాత్రను పరిచయం చేసే సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆకాశ్‌ సరసన గెహన సిప్పీ నటించింది.

ఆకట్టుకుంటున్న 'గాడ్సే' ట్రైలర్: "'అర్హతున్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్ధతున్నోడే పార్లమెంట్‌లో ఉండాలి.. మర్యాదున్నోడే మేయర్‌ కావాలి.. సభ్యతున్నోడే సర్పంచి కావాలి" అని అంటున్నారు నటుడు సత్యదేవ్‌. ఆయన నటించిన సరికొత్త చిత్రం 'గాడ్సే'. గోపీ గణేశ్ పట్టాభి ఈ చిత్రానికి దర్శకుడు. పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 'గాడ్సే' ట్రైలర్‌ని నటుడు వరుణ్‌తేజ్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇదీ చూడండి:నజ్రియాతో నాని సతీమణి డ్యాన్స్‌.. తెగ వైరల్​ అవుతున్న వీడియో

ABOUT THE AUTHOR

...view details