Anil ravipudi Balakrishna movie: ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందే సినిమా సెప్టెంబరులో మొదలు కానుంది. ఈ చిత్రంలో బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రను చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం, చిలుకూరివారిపాలెంలో తన స్వగృహానికి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి అప్పుడే! - balakrishna
Anil ravipudi Balakrishna movie: బాలకృష్ణ-అనిల్ రావిపూడిల కలయికలో రూపొందే సినిమా సెప్టెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రను చేయబోతున్నారని అనిల్ చెప్పారు.
"బాలకృష్ణతో సెప్టెంబరులో సినిమా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాను. బాలయ్య- బోయపాటి అంటే ఓ మార్క్ ఉంది. వారి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్టే. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణ ఇప్పటి వరకు చేయని పాత్రను సృష్టిస్తున్నాం. అభిమానులకు గుర్తుండిపోయేలా నూతన గెటప్ ఉంటుంది. అవసరమైతే బాలయ్యబాబును మా స్వగ్రామం చిలుకూరివారిపాలెం తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడ్డాం. దేవుడి దయవల్ల భవిష్యత్తులో కరోనా మహమ్మారి విజృంభించకుంటే తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా గాడినపడినట్లే. మే 27న 'ఎఫ్-3' విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటన ప్రేక్షకులను అలరిస్తుంది" అని తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇదీ చూడండి: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్.. తెలుగులో 'ది కశ్మీర్ ఫైల్స్'