తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అందులో ఆశ్చర్యమేంటి?'.. సౌత్ సినిమాలపై బీటౌన్ హీరో వ్యాఖ్యలు! - స్టార్​హీరో అనిల్​ కపూర్​

Anil Kapoor About South Industry: దక్షిణాది చిత్రసీమ నుంచి బాలీవుడ్​ ఎంత నేర్చుకుంటే అంత మంచిదని అన్నారు బాలీవుడ్​ స్టార్​హీరో అనిల్​కపూర్​. సౌత్​ ఇండస్ట్రీలో ఎప్పడూ మంచి కథలతో సినిమాలు తెరకెక్కిస్తారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

అనిల్​ కపూర్​
అనిల్​ కపూర్​

By

Published : Apr 18, 2022, 7:27 PM IST

Anil Kapoor About South Industry: బాలీవుడ్​ను ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమ ఏలుతోంది. ఇటీవల విడుదలైన చిత్రాలు బాలీవుడ్​లో సూపర్ సక్సెస్​ను అందుకుంటున్నాయి. 'పుష్ప', 'ఆర్​ఆర్​ఆర్'​, 'కేజీఎఫ్​ 2' సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలు సైతం ఈ చిత్రాలను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఫంక్షన్​లో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్​ కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ వాళ్లు చాలా మంచి చిత్రాలు చేస్తారని ఆయన కొనియాడారు. దక్షిణాది చిత్రాలు విజయవంతం కావడం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని అన్నారు.

"దక్షిణాది చిత్రాలతోనే నా కెరీర్‌ను ప్రారంభించా. అది ఎనలేని సంతోషాన్నిచ్చింది. సౌత్​ఇండియా సినిమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వారి నుంచి బాలీవుడ్‌ ఎంత ఇన్​పుట్స్​ తీసుకుంటే.. హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌కు అంత మంచిది. దక్షిణాదిలోనే వృత్తి నైపుణ్యం అంటే ఏంటో నాకు తెలిసింది. బాపు దర్శకత్వంలో నేను తొలి సినిమా చేశాను. ఆ తర్వాత కన్నడ భాషలో మరో సినిమా చేశాను. అది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కింది."

-అనిల్​ కపూర్​, బాలీవుడ్​ స్టార్​ హీరో

దక్షిణాది చిత్రసీమలో ఇప్పటివరకు చక్కటి కథలున్న సినిమాలు చాలా తీశారని, భవిష్యత్తులోనూ తీస్తారని అనిల్​కపూర్​ అన్నారు. తనకు ఈ విషయంలో ఎటువంటి సర్​ప్రైజ్ లేదని, తాను ఎప్పడూ గొప్ప దర్శకుల విజన్​ను గౌరవిస్తానని పేర్కొన్నారు. బీటౌన్ స్టార్ హీరో.. సౌత్​ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపైన ఇటువంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఇక, మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో అనిల్​కపూర్​ నటించనున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లుకొడుతున్నాయి. ఆ సినిమాలో ఆయన మహేశ్​కు తండ్రిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఇవీ చదవండి:'భలే భలే బంజారా' ఫుల్​ సాంగ్ .. కేక పుట్టించిన చిరు- చరణ్

మహేశ్​కు తండ్రిగా బాలీవుడ్​ సీనియర్​ హీరో!

ABOUT THE AUTHOR

...view details