తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం - యాంకర్ విష్ణు ప్రియ తల్లి మృతి

బుల్లితెర నటి, యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. గురువారం విష్ణుప్రియ తల్లి తుదిశ్వాస విడిచారు.

Anchor Vishnu priya mother died
యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం

By

Published : Jan 27, 2023, 12:12 PM IST

బుల్లితెర నటి, యాంకర్‌ విష్ణు ప్రియ ఇంట విషాదం చోటు చేసుకుంది. గురువారం విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ విష్ణు ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్​ పోస్ట్‌ పెట్టింది. "మై డియర్‌ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాస వరకూ గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం.. అలాగే బలహీనత కూడా. ఇకపై ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావు. ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటావు. అలా, నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా" అని కన్నీటి పర్యంతమైంది.తన తల్లిని హత్తుకున్న మరో ఫొటోని షేర్‌ చేస్తూ.. "ఇకపై నీ ముద్దులను మిస్‌ అవుతాను అమ్మా" అని పేర్కొంది.

దీంతో విష్ణుకు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర తారలు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక విష్ణు కెరీర్‌ విషయానికి వస్తే.. ఈటీవీలో ప్రసారమైన 'పోవే పోరా'తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు కార్యక్రమాల్లో అలరించింది. ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్​లో రాణిస్తోంది.

ఇదీ చూడండి:స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్‌ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details