తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజీవ్​కు విడాకులు నిజమేనా?'.. సుమ షాకింగ్​ కామెంట్స్​ - రాజీవ్​ కనకాలు

Ali Tho Saradaga Suma: ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఈ వారం ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తన భర్త రాజీవ్​ కనకాలతో విడాకుల విషయంపై సుమ పెదవి విప్పారు.

anchor suma ali tho saradaga
anchor suma ali tho saradaga

By

Published : Apr 26, 2022, 4:52 PM IST

Updated : Apr 26, 2022, 5:25 PM IST

Anchor Suma Rajeev Divorce: యాంకర్ సుమ.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. రియాల్టీ షోస్ చేస్తూ బుల్లితెర టాప్ యాంకర్‏గా కొనసాగుతున్నారు. ఇక, చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతున్నారు. 'జయమ్మ పంచాయితీ' సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించనున్నారు. ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమ.. తన భర్తతో విడాకులపై వచ్చిన రూమర్స్​పై స్పందించారు.

"కరోనా సమయంలో మీ వివాహ బంధంపై రూమర్స్ వచ్చాయి, మీరు విడిపోతున్నారంటూ.. వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని అందరూ అన్నారు.. అది నిజమేనా" అని ప్రశ్నించారు ఆలీ. అందుకు సుమ.. "ఇద్దరి మధ్య గొడవలు వాస్తవమే. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు వచ్చాయి. కానీ ఒకటి మాత్రం నిజం. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టం" అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ విషయం పక్కన పెడితే, ఈ కార్యక్రమంలో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్నో నవ్వులు పంచే ఆలీకే పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించింది. 'జయమ్మ పంచాయితీ'లోని ఓ పాటను ఆలపించి, మరో పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది. తనకు ఆరుగురు అత్తయ్యలు ఉన్నారని, 13 మంది బావలు ఉన్నారని తెలిపింది. హీరోగా తమ తనయుడి ఎంట్రీ గురించి త్వరలోనే చెప్తానంది.

Last Updated : Apr 26, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details