తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Anchor Suma Onam celebrations : సుమ ఇంట ఓనమ్​ సెలబ్రేషన్స్.. కేరళ వంటకాలు తింటూ యాంకర్స్​ సందడి.. - యాంకర్​ సుమ సినిమాలు

Anchor Suma Onam celebrations : టాలీవుడ్​ సీనియర్ యాంకర్​ సుమ ఇటీవలే తన ఇంట్లో తోటి యాంకర్స్​కు గ్రాండ్​ పార్టీ ఇచ్చారు. కేరళ వారికి అతిపెద్ద పండగైన ఓనమ్‌ను సుమ తన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్​ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యాంకర్స్ పాల్గొన్నారు. సుమ ఇంట్లో ఓనమ్ వేడుకల వీడియోను మీరు ఓ సారి చూసేయండి..

Anchor Suma Onam celebrations
Anchor Suma Onam celebrations

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 9:42 PM IST

Anchor Suma Onam celebrations : టాలీవుడ్​ సీనియర్ యాంకర్​ సుమ ఇటీవలే తన ఇంట్లో తోటి యాంకర్స్​కు గ్రాండ్​ పార్టీ ఇచ్చారు.కేరళ వారికి అతిపెద్ద పండగైన ఓనమ్‌ను తన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్​ చేసుకున్న సుమ.. తన తోటి యాంకర్స్​ను ఇంటికి పిలిచి సందడి చేశారు. వారిని విందుకు ఆహ్వానించి కేరళ స్పెషల్​ వంటకాల రుచిని చూపించారు. ఇక కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యాంకర్స్​ సుమ ఇంట్లో సందడి చేస్తూ కనిపించారు.

Suma Onam Celebrations : రవి, రష్మీ, అనసూయ, విష్ణు ప్రియా, నేహా.. ఇలా యాంకర్స్ అందరూ ఈ విందుకొచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయా యాంకర్స్​తో పాటు సుమ తన సోషల్ మీడియా హ్యాండిల్​లో పోస్ట్​ చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్​ నెట్టింట తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తెరపై కనిపించి తమని అలరించే యాంకర్స్​ ఇలా ఆఫ్​స్క్రీన్​లో టైమ్​ స్పెండ్​ చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. యాంకర్​ సుమకు ఓనమ్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక యాంకర్​ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరతో పాటు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సుమ​.. తన యాంకరింగ్​తో ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన ఆమె.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలానినే తెలుగును బాగా నేర్చుకున్నారు. తన కెరీర్​ తొలినాళ్లలో సీరియల్స్​లో నటించిన సుమ.. ఆ తర్వాత యాంకరింగ్​ను తన కెరీర్​గా మలుచుకుని దూసుకెళ్తున్నారు.

Anchor Suma Movies : అలా టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, గేమ్ షోలు, సెలబ్రెటీల ఇంటర్వ్యూలు.. అంటూ వరుస ప్రోగ్రాములతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. స్టార్​ మహిళ, జీన్స్​, సుమ అడ్డా అంటూ బుల్లితెర ఆడియెన్స్​కు చేరువయ్యారు. అటు యాంకరింగ్​తోనే కాకుండా సినిమాల్లో కనిపిస్తూ.. వెండితెర ప్రేక్షకులను పలకరించి సందడి చేస్తుంటారు. 'జయమ్మ పంచాయతీ' అనే సినిమాతో ఆమె ఆడియెన్స్​ ముందుకొచ్చారు. ఈ సినిమాతో నటిగా ఆమె మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

డీజే పెట్టు డీజే!.. హీరోగా యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్​ లుక్​ రిలీజ్

యాంకర్​ సుమ మంచి మనసు.. 30 మంది విద్యార్థులను దత్తత

ABOUT THE AUTHOR

...view details