తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇంత ఖరీదైన చీర ఇప్పటిదాక కట్టలేదు'.. తన పెళ్లి చీర ధరెంతో చెప్పిన యాంకర్ సుమ - యాంకర్ సమ లేటెస్ట్ న్యూస్

Anchor Suma : తన పెళ్లి నాటి ఆసక్తికర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు యాంకర్​ సుమ కనకాల. తాజాగా షాపింగ్​కు వెళ్లిన సుమ.. తన పెళ్లి రోజు చీర ధరెంతో బయటపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్​ ఛానల్​లో పోస్ట్​ చేశారు.

Anchor Suma
Anchor Suma

By

Published : Aug 31, 2022, 9:15 PM IST

Anchor Suma : యాంకర్​ సుమ అంటే తెలియని వారుండరు. మొదట యాక్టర్​గా కెరీర్​ ప్రారంభించిన సుమ.. ఆ తర్వాత యాంకర్​గా మారి అనేక మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు అందరిని తనదైన పంచ్​లతో అలరిస్తున్నారు సుమ. టీవీ షోలు, ప్రీ రిలీజ్​ ఈవెంట్లు, ప్రమోషన్స్​ ఇలా అన్నింట్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీటితో పాటు సోషల్​ మీడియాలోను యాక్టివ్​గా ఉంటూ అనేక విషయాల్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్​ ఛానల్​ను ప్రారంభించిన సుమ.. ఈ ఛానల్​లో తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన అనేక విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్​ చేసిన వీడియోలో తన పెళ్లి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వాళ్ల అమ్మ 80వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఖరీదైన చీర కొనిపెట్టారు. ఈ సందర్భంగా షాపింగ్‌కు వెళ్లిన సుమ అక్కడ షాపింగ్‌ మాల్లో తన పెళ్లి చీర ఖరీదు ఎంతో చెప్పారు. తన తల్లితో కలిసి చీరలను చూస్తుండగా.. "ఇక్కడ ఉన్నవన్నీ రూ. 15 వేల లోపు చీరలని.. మీ రేంజ్‌ సారీస్‌ పై ఫ్లోర్లో ఉంటాయి"అని సేల్స్‌మాన్‌ చెప్పాడు. అతడి మాటలు విన్న సుమ.. తాము ఈ రేంజ్‌లోనే తీసుకుంటామంటూ తనదైన స్టైల్లో పంచులు వేశారు. షాపింగ్ మాల్​లోని చీరలు, వాటి ప్రత్యేకత, డిజైన్స్‌ గురించి ఆరా తీశారు.

ఈ నేపథ్యంలోనే ఆమెకు ఓ చీర నచ్చి దాని ధరెంత అని అడగగా.. రూ. 2 లక్షలు అని సమాధానం ఇచ్చాడు సేల్స్​మాన్​. అతడు చెప్పిన ధరను విన్న సుమ ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఇప్పటివరకు ఇంత ఖరీదైన చీరను కట్టలేదని.. పెళ్లికే రూ. 11 వేల చీర కట్టానంటూ అసలు విషయం చెప్పేశారు. సుమ తన పెళ్లి నాటి చీర ధర చెప్పడం వల్ల అది కాస్తా వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'అప్పట్లో రూ. 11 వేలు అంటే కాస్ట్‌లీ యే కదా అని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. మీ రెంజ్‌కి ఇది తక్కువే' అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. కాగా రాజీవ్‌ కనకాల-సుమ పెళ్లి 1999 ఫిబ్రవరి 10న జరిగింది.

ఇవీ చదవండి:నాగార్జున బిగ్​బాస్ సీజన్​ 6​ ఫస్ట్ గ్లింప్స్​ ఆగయా

Filmfare awards 2022.. ఉత్తమ నటులుగా రణ్​వీర్​, కృతి

ABOUT THE AUTHOR

...view details