తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డీజే పెట్టు డీజే!.. హీరోగా యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్​ లుక్​ రిలీజ్ - యాంకర్ సుమ కొడుకు అప్డేట్​

ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు రోషన్ ఫస్ట్ లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు.

anchor suma kanakala son roshan makes his debut as hero
anchor suma kanakala son roshan makes his debut as hero

By

Published : Mar 15, 2023, 8:48 PM IST

సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీల వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. స్టార్​ హీరోలు త‌మ కుమారుల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేశారు. అంతే కాకుండా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా త‌మ వార‌సుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్​ల పిల్లలు కూడా తెరంగ్రేటం చేశారు. ఇప్పుడు బుల్లితెర స్టార్​ యాంకర్​ సుమ.. కుమారుడు రోషన్​ కూడా సినీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర స్టార్ యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్ కనకాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి.విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బుధవారం.. రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. డీజేగా వైబ్రెంట్ అవతార్‌లో రోషన్ కనకాల కనిపిస్తున్నారు. పోస్టర్‌లో రోషన్ సన్ గ్లాసెస్‌తో డీజే సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ న్యూ ఏజ్ రోమ్- కామ్‌గా రూపొందుతోంది. మ్యూజిక్​ డైరెక్టర్​ శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. నవీన్ యాదవ్ కెమెరా‌మ్యాన్​గా పనిచేస్తున్నారు. రవికాంత్ పేరేపుతో పాటు విష్ణు కొండూరు, సెరి- గన్ని రచయితలు. వంశీకృష్ణ స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

కాగా, తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యాంకర్​ సుమ కనకాల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'నువ్వనుకున్నది జరుగుతోంది రోషన్. నీ కలలను ఆచరణలో పెట్టు. రవికాంత్ పేరేపు, శ్రీచరణ్ పాకాల పనిచేస్తున్న ఈ సినిమా ఒక అందమైన, వినోదాత్మకమైన ప్రయాణం కాబోతోంది. మా రోషన్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నో మధురానుభూతులు పొందుతున్న, కలలను సాకారం చేసుకుంటున్న ఈ ఏడాది నీకు ఎంతో ప్రత్యేకం' అని సుమ కనకాల తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక సుమ అభిమానులు రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు హీరోగా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details