తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ రూమర్స్​పై వీడియో రిలీజ్ చేసిన సుమ.. మళ్లీ వెంటనే డిలీట్​.. ఎందుకో? - suma retirement latest news

సుమ యాంకరింగ్​కు దూరం కాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత వెంటనే ఆ వీడియోను డిలీట్​ చేసింది. ఆ వివరాలు..

Anchor Suma
ఆ రూమర్స్​పై స్పందించిన సుమ.. మళ్లీ ఆ వెంటనే డిలీట్.. ఎందుకలా?​

By

Published : Dec 28, 2022, 12:46 PM IST

యాంకర్ సుమ అంటే బుల్లితెర వినోదం.. బుల్లితెర వినోదం అంటే యాంకర్​ సుమ... అలా అంతటి బంధాన్ని పెనవేసుకుంది. అయితే ఆమె యాంక్​రింగ్​కు విరామం ఇవ్వనుందనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దీనిపై స్పందించింది సుమ.

'హలో.. రీసెంట్‌గా ఓ న్యూఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ షోలో ఎమోషనల్ అయ్యాను. కాని అది ఎందుకో ఎపిసోడ్ చివర్లో తెలుస్తుంది.. కంగారు పడకండి.. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు.. మెసెజ్‌లు చేస్తున్నారు.. నేను బుల్లితెర కోసమే పుట్టాను.. ఎంటర్టైన్ కోసమే పుట్టాను.. నేను ఎటూ వెళ్లడం లేదు.. కాబట్టి మీరు హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని సుమ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వీడియోను మళ్లీ సుమ.. వెంటనే ట్విట్టర్ నుంచి డిలీట్ చేసింది. ఎందుకు అలా ట్వీట్‌ను డిలీట్ చేసింది అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు.

కాగా, ఇటీవలే ఓ షోలో న్యూఇయర్ వేడుకకు సంబంధించిన 'వేర్ ఈజ్ ది పార్టీ' అంటూ సుమ సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో సుమ కాస్త ఎమోషనల్ అయింది. తెలుగు వారి అభిమానం గురించి చెప్పుకుని కంటతడి పెట్టేసుకుంది. మలయాళీ అయినా తనను ఇంతలా ప్రేమించి, ఆదరించారని, కానీ ఇప్పుడు విరామం తీసుకుంటున్నాను అని సుమ చెబుతూ భావోద్వేగానికి గురైంది. దీంతో బుల్లితెరకు సుమ దూరం కాబోతోందనే వార్తలు తెగ వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

యాంకరింగ్​కు దూరమంటూ రూమర్స్​.. స్పందించిన సుమ.. ఆ వెంటనే డిలీట్​.. ఎందుకో?

ఇదీ చూడండి:ఈ బ్యూటీ నవ్వుతోనే హార్ట్​ బీట్​ పెంచేస్తోందిగా

ABOUT THE AUTHOR

...view details