తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యాంకర్ రష్మి ఇంట విషాదం - Anchor Rashmi emotional post

యాంకర్ రష్మి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఎమోషనల్​ అయింది.

Anchor Rashmi granmother died
యాంకర్ రష్మి ఇంట తీవ్ర విషాదం..

By

Published : Jan 21, 2023, 10:41 AM IST

Updated : Jan 21, 2023, 11:56 AM IST

బుల్లితెర‌పై జబ‌ర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ యాంక‌ర్‌గా ఆడియెన్స్​లో సూపర్​ క్రేజ్ తెచ్చుకున్న భామ ర‌ష్మి. ఇక సినిమాలు చేస్తూ సోషల్​మీడియాలోనూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ యూత్​లోనూ ఫ్యాన్స్​ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబంలోని ముఖ్యమైన వ్య‌క్తి క‌న్నుమూశారు. ఆమె గ్రాండ్ మ‌ద‌ర్‌ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రష్మి తెలియజేస్తూ తన గ్రాండ్ మదర్​తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసి ఎమోషనల్​ అయింది. గుండె బరువెక్కిపోయిందంటూ భావోద్వేగానికి గురైంది.

'ఈ రోజు మా గ్రాండ్‌ మదర్‌ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి విడ్కోలు పలికాం. ఆమె ఎంతో ధైర్యవంతురాలు. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి.' అని పేర్కొంది ర‌ష్మి. దీంతో నెటిజ‌న్స్ రష్మికి ధైర్యంగా ఉండాల‌ని చెబుతూ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయం అయినా.. బుల్లితెరపై జబర్దస్త్​ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది రష్మి. ముఖ్యంగా బుల్లితెరపై సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్‌తో ఈ బ్యూటీకి ఫుల్​ క్రేజ్ వచ్చింది. అలా ప్రస్తుతం బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ వెండితెరపై రాణిస్తోంది. ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి టీవీ షోలకు యాంకరింగ్ చేస్తోంది. గతేడాది రష్మి హీరోయిన్‌గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆమె.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్​లో నటిస్తోంది.

ఇదీ చూడండి:'వీర సింహారెడ్డి' దర్శకుడికి చిరంజీవి స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే?

Last Updated : Jan 21, 2023, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details