ఏ రంగంలో అయినా ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులను తీసుకురావాలని భావిస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలా వరకు ఇదే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది స్టార్స్ తమ వాళ్లను చిత్రసీమకు పరిచయం చేశారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి స్టార్ యాంకర్ అనసూయ సోదరి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.
యాంకర్‌గా అనసూయ చెల్లి.. ఆ షోతో ఎంట్రీ!
యాంకర్, నటి అనసూయ చెల్లి వైష్ణవి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఆ సంగతులు..
అనసూయ భరద్వాజ్.. బుల్లితెర స్టార్ యాంకర్‌గా, వెండితెర నటిగా తనదైన స్ట్లైల్లో అభిమానులను అలరిస్తున్నారు. విలక్షణమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడామె తన ఇద్దరు చెల్లెల్లో ఒకరైన వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందంలోనూ, చలాకీతనంలోనూ అనసూయని పోలి ఉండే వైష్ణవి.. అక్క బాటలోనే రాణించాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే వైష్ణవికి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చే ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది కాలం వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి:బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ డైరెక్టర్ సినిమాతోనే!