తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనసూయను టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది - 'దర్జా' న్యూస్

యాంకర్​ అనసూయ, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దర్జా'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్​ను గురువారం విడుదల చేసింది చిత్ర యూనిట్​.

Anasuya new movie
Darja teaser

By

Published : Mar 31, 2022, 1:04 PM IST

బుల్లితెరపై టాప్​ యాంకర్​గా కొనసాగుతూ.. మరోవైపు సినిమాల్లో నటిగా రాణిస్తూ.. ఫుల్​ బిజీగా ఉంటున్నారు అనసూయ భరద్వాజ్​. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. తాజాగా 'దర్జా' అనే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోన్న ఈ మూవీలో సునీల్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. 'ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది', 'ఎవరైనా ఈ కనకాన్ని టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది' అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌ లాంచ్‌ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్‌ చైర్మన్‌ భూమాల శ్రీరామ్‌ మూర్తితో పాటు చిత్రయూనిట్‌ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు.

ABOUT THE AUTHOR

...view details