తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నన్ను ఆంటీ అని పిలిస్తే ఇప్పుడు కోపం రావట్లేదు.. అది వాళ్ల ఖర్మ' - అనసూయ ట్విట్టర్​ ట్వీట్స్​

యాంకర్​, నటి అనసూయను ఆంటీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తుంటారు. అలా తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి​ ఎప్పటికప్పుడు దిమ్మితిరిగే కౌంటర్లు ఇస్తుంటారు. అయితే ఆదివారం ఇన్​స్టా ఫాలోవర్స్​తో ముచ్చటించారు. ఈ సమయంలో 'అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తుంది?' అని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. దానికి ఈ అందాలముద్దుగుమ్ము ఏమని రిప్లై ఇచ్చిందంటే?

anasuya bharadwaj instagram
anasuya bharadwaj instagram

By

Published : Apr 2, 2023, 10:55 PM IST

వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. సినిమాలే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ ఆమె చురుగ్గా ఉంటారు. ఇక ఆమెకు సోషల్​ మీడియోలో ఉండే ఫ్యాన్స్ పాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికితే చాలు.. సోషల్​ మీడియాలో పోస్ట్​లు, ఫొటోలు షేర్​ చేస్తూ.. అనేక విషయాలపైనా తన స్పందన తెలియజేస్తారు. ఆదివారం సెలవు కావడం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

'అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తుంది?' అని ఓ అభిమాని ఇన్​స్టాలో అనసూయను ప్రశ్నించాడు. వెంటనే ఈ అందాల భామ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "ఎందుకంటే వాళ్ల అర్థాలు వేరే ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు నన్ను ఆంటీ అంటే కోపం రావట్లేదు. అది వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నందున అలాంటి కామెంట్లు పట్టించుకోవటం లేదు" అని సమాధానం ఇచ్చారు.

ఇదే సమయంలో తన కొత్త సినిమా అప్​డేట్​ల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ రెండో వారంలో తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఇన్​స్టా ద్వారా తెలియజేశారు. ఈ సినిమా గురించి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. టీవీ షోలు, ప్రారంభోత్సవాలు, ప్రకటనలు, సినిమాల కన్నా తన కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు గానూ.. తాను పూర్తి శాఖాహారినని సమాధానం ఇచ్చారు.

ట్రోలర్స్​కు దిమ్మితిరిగే కౌంటరిచ్చిన అనసూయ!
తన గ్లామర్​తో తన అందాల ఫాలోవర్లకు, అభిమానులకు అందాల విందిస్తూ ఎప్పటికప్పుడూ సోషల్​మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు అనసూయ. దీంతో ఆమెను కొందరూ ప్రశంసించే వారైతే మరికొందరు అనసూయను విమర్శిస్తూ తెగ ట్రోల్స్ చేస్తుంటారు. ఇటీవలే తాను పోస్ట్ చేసిన ఫొటోలకు 'పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ..?' అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అలా ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నవారికి ఆమె కౌంటరిస్తుంటారు. అయినా సరే అనసూయపై ట్రోలర్స్​ ట్రోల్స్​ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా పెట్టిన ఫొటోను చూసు ట్రోలర్స్​ కంగుతిన్నారు. తనపై ట్రోల్స్​, కాంమెట్స్​ చేస్తున్నవారికి దిమ్మితిరిగేలా ఓ పోస్ట్ పెట్టారు. సోషల్​ మీడియాలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, సినీనటులను కించపరచేలా అసభ్యకర పోస్ట్​లు, కాంమెట్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. హైదరాబాద్​ పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఈ న్యూస్​ను ఆమె ట్విట్టర్​ హాండిల్​లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్​ వైరల్​గా మారింది.

ఇక అనసూయ భరద్వాజ్​ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగమార్తాండ'లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పుపొందారు. ప్రస్తుతం ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​, సుకుమార్​ కాంబినేషన్​లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'పుష్ప 2' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటుగా 'పేపర్​బాయ్' చిత్ర దర్శకుడు జయశంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అరి: మై నేమ్​ ఈజ్​ నో బడి' అనే సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటుగా పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ కూడా ఆ అందాల యాంకర్​ నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details