తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనన్య పాండే ఝలక్​.. ఆ హీరోకు బ్రేకప్​! - అనన్యా పాండే ఇషాన్ ఖట్టర్​ లవ్​ స్టోరీ బ్రేకప్​

Ananya pandey Ishaan khatter Breakup: బాలీవుడ్​ హీరోయిన్​ అనన్య పాండే.. హీరో ఇషాన్​ కట్టర్​తో విడిపోయినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ జంట స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

Ananya pandey break up with Ishaan khatter
ఇషాన్​ కట్టర్​ అనన్య పాండే బ్రేకప్​

By

Published : Apr 6, 2022, 11:39 AM IST

Updated : Apr 6, 2022, 11:57 AM IST

Ananya pandey Ishaan khatter Breakup: 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ భామ అనన్య పాండే. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది ప్రసుత్తం బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'లైగర్'తో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

కాగా, బాలీవుడ్‌ యువ నటుడు, షాహిద్‌ కపూర్ సోదరుడు ఇషాన్‌ కట్టర్‌తో అనన్య రిలేషన్‌లో ఉన్నట్లు కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ‘ఖాళీ పీలీ’ అనే సినిమా కోసం వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసిందని అప్పట్లో అందరూ చెప్పుకొన్నారు. తరచూ వీరిద్దరూ టూర్స్‌కు వెళ్లి రావడం, షాహిద్‌ నివాసంలో జరిగే పలు ఫంక్షన్స్‌లో అనన్య సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలవడం ఈ ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో అనన్య-ఇషాన్‌ విడిపోయినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది.

ఇదీ చూడండి: చైతూ, అఖిల్​కు సవాల్ విసిరిన సమంత!

Last Updated : Apr 6, 2022, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details