తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

13 రోజులైనా ఆగని 'బేబీ' జోరు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే? - బేబీ మూవీ కలెక్షన్స్​

Baby movie collections : ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్ కలిసి నటించిన చిత్రం 'బేబీ' విడుదలై 13 రోజులు అవుతున్నా ఇంకా వసూళ్లను అందుకుంటూనే ఉంది. ఇంతకీ ఈ చిత్రానికి లాభాలు ఎన్ని వచ్చాయంటే..

Baby movie  13 days  world wide collections
13 రోజులైన ఆగని 'బేబీ' జోరు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే?

By

Published : Jul 27, 2023, 1:13 PM IST

Baby movie collections : ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్ కలిసి నటించిన చిత్రం 'బేబీ'. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా రూ. 7.40 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ.8కోట్లు. అయితే ఈ చిత్రం ఆ టార్గెట్​ను ఎప్పుడో దాటేసి. త్రిపుల్​ ధమాకా హిట్​ను అందుకుంది. ఈ చిత్రం విడుదలై 13 రోజులు అవుతున్నా ఇంకా వసూళ్లను అందుకుంటూనే ఉంది.

13వ రోజు.. 13వ రోజు నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 90 లక్షల షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఆంధ్రా తెలంగాణలో.. 13 రోజుల్లో నైజాంలో రూ. 13.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.65 కోట్లు, కృష్ణాలో రూ. 1.76 కోట్లు, నెల్లూరులో రూ. కోటి కలెక్ట్ అయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 31.42 కోట్లు షేర్, రూ. 57.15 కోట్లు గ్రాస్ వసూళ్లు అయ్యాయి.

వరల్డ్​ వైడ్​గా.. వరల్డ్​వైడ్​గా ఈ చిత్రం 35.64 కోట్ల షేర్​.. 67.10 కోట్ల గ్రాస్​ అందుకుందట. కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 13 రోజుల్లో రూ. 1.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.48 కోట్లు వచ్చాయట. అంటే 13 రోజుల్లో దాదాపు రూ. 27 కోట్ల వరకు లాభాలను అందుకున్నట్టే. ఇకపోతే ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ రూపొందించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్​ డైరెక్టర్​గా పనిచేశారు. నాగబాబు, వైవా హర్ష, కిర్రాక్ సీత తదితురులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి :

'బ్రో' బుకింగ్స్, టికెట్​ రేట్స్ పరిస్థితి ఎలా ఉందంటే?

శ్రీలీల కూడా తగ్గేదే లే.. అల్లుఅర్జున్​కే నో చెప్పిందిగా!

ABOUT THE AUTHOR

...view details