తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బేబీ'.. రిలీజై పదిరోజులైనా తగ్గని జోరు.. ఓవర్సీస్​లోనూ రికార్డ్​ కలెక్షన్స్​! - బేబీ వైష్ణవి చైతన్య

Baby movie collections : ఆనంద్​ దేవరకొండ-వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్‌ కలిసి నటించిన కల్ట్ లవ్ స్టోరీ 'బేబీ' విడుదలై పది రోజులైనా బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. ఓవర్సీస్​లోనూ అదిరిపోయే వసూళ్లను అందుకుందట. ఆ వివరాలు..

Baby overseas collections
Baby overseas collections

By

Published : Jul 25, 2023, 11:12 AM IST

Updated : Jul 25, 2023, 12:55 PM IST

Baby movie collections : కల్ట్ లవ్ స్టోరీ 'బేబీ' విడుదలై పది రోజులవుతున్నా ఇంకా సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూనే ఉంది. చిన్న చిత్రంగా రిలీజైన ఈ ఫీల్‌గుడ్‌ మూవీ.. యూత్ ఆడియెన్స్​తో పాటు మిగతా వర్గాలను కూడా బాగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోనూ ఊహించని రేంజ్​లో వసూళ్లను నమోదు చేస్తోంది.

Baby overseas collections : ఓవర్సీస్​లోనూ థియేటర్లు హౌస్​ ఫుల్​ బోర్డులతో నిండిపోతున్నాయట. సినిమా బ్లాక్​ బస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. నార్త్​ అమెరికాలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను దాటేసి మరిన్ని వసూళ్లను అందుకునే దిశగా దూసుకెళ్తోంది. బ్రేక్ ఈవెన్​ టార్గెట్​ 400K డాలర్స్... ఇప్పటికే చిత్రం దాన్ని అధిగమించి 538K డాలర్స్​ను వసూలు చేసిందట. మొదటి వారం ఈ చిత్రం 348K డాలర్లను అందుకుందని తెలిసింది. ఆ తర్వాత కాస్త జోరు తగ్గినా మళ్లీ పుంజుకుని రెండో వారంలో మరో 190K డాలర్లను వసూలు చేసిందట. మొత్తంగా ఓవర్సీస్​లోని అన్ని సెంటర్స్​లో ఈ చిత్ర బ్లాక్​ బాస్టర్​ హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది.

తెలుగురాష్ట్రాల్లోనూ అన్ని సెంటర్లలో..తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఊహించని రేంజ్​లో వసూళ్లు చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు 10 రోజుల్లో సుమారు రూ.66.6 కోట్ల గ్రాస్‌ వసూళ్లను అందుకున్నట్లు తెలిసింది. రీసెంట్​గా మూవీటీమ్ కూడా ఈ విషయాన్ని తెలిపింది. ఆంధ్ర, తెలంగాణ ఏ,బీ,సీ అన్నీ సెంటర్స్​లో సినిమా మంచిగా ఆడుతోంది. అయితే ఏ సెంటర్​తో పోలిస్తే బీ, సీ సెంటర్స్​లో ప్రేక్షకుల్లో ఎక్కువ స్థాయిలో వస్తున్నారట.

ఇకపోతే ట్రయాంగిల్ లవ్​స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ఆనంద్​ దేవరకొండ-వైష్ణవి చైతన్య- విరాజ్ అశ్విన్‌ కలిసి నటించారు. తమ నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ చిత్రానికి 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' ఫేమ్​ సాయి రాజేష్ నీలం డైరెక్ట్ చేశారు. శ్రీనివాస కుమార్ నాయుడు(ఎస్కేఎన్​) నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చూడండి :

హీరోలను మోసం చేసిన హీరోయిన్లు వీళ్లే.. 'రమ్యకృష్ణ' టు 'వైష్ణవి'.. లిస్ట్​లో ఇంకా ఎవరంటే?

'RX 100', 'బేబీ'లే కాదు గురూ.. గోల్డెన్ హార్ట్​ బ్యూటీలు ఉన్నారు... ఇక్కడ లుక్కేయండి!

Last Updated : Jul 25, 2023, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details