తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హీరో నితిన్​పై ఆ దర్శకుడు ఫుల్​ఫైర్​.. మాటిచ్చి తప్పాడంటూ ఎమోషనల్​.. - కొరియోగ్రాఫర్​ అమ్మ రాజశేఖర్​

నటుడు నితిన్‌పై ఓ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ స్టేజ్​పైనే తీవ్రంగా మండిపడ్డారు. నితిన్​ తనకు మాటిచ్చి తప్పాడంటూ, అది తనకెంతో అవమానకరంగా ఉందంటూ ఎమోషనల్​ అయ్యారు.

Amma rajasekhar fire on Nithin
హీరో నితిన్​పై ఆ దర్శకుడు ఫుల్​ఫైర్

By

Published : Jul 11, 2022, 3:32 PM IST

Amma rajasekhar fire on Nithin: నటుడు నితిన్‌పై దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ అమ్మ రాజశేఖర్‌ మండిపడ్డారు. నితిన్‌ ప్రవర్తన తనని ఎంతగానో బాధపెట్టిందన్నారు. తాను దర్శకత్వం వహించిన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తానని నితిన్‌ మాటిచ్చి తప్పాడంటూ, అది తనకెంతో అవమానకరంగా ఉందంటూ అమ్మ స్టేజ్‌పైనే భావోద్వేగానికిలోనయ్యారు.

ఏం జరిగిందంటే.. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'హై ఫైవ్‌'. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్‌ ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ఆయన రాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్‌.. "పది రోజుల క్రితమే నితిన్‌ని ఈ ఫంక్షన్‌కు రమ్మని ఆహ్వానించా. ఆయన వస్తానని మాటిచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి ఆయన కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్‌ చేయించా. నితిన్‌కు అస్సలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్‌ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్‌ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్‌ అయినా పంపమని కోరాను. అదీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్‌.. నువ్వు రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది" అని అమ్మ రాజశేఖర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నితిన్‌ కథానాయకుడిగా నటించిన 'టక్కరి' చిత్రానికి అమ్మ రాజశేఖరే దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి: అతనికి లవ్​లెటర్​ రాశాను.. అమ్మానాన్న ఫుల్​గా కొట్టారు: సాయిపల్లవి

ABOUT THE AUTHOR

...view details