బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో గాయం అయింది. ఈ మేరకు అమితాబ్ తన బ్లాగ్‌లో వివరాలు వెల్లడించారు. షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్ అయిందని చెప్పారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రక్త స్రావాన్ని ఆపడానికి కొన్ని కుట్లు కూడా వేశారని తెలిపారు. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాని.. అభిమానులు ఆందోళని చెందవద్దని కోరారు బిగ్ బీ.
"ఇనుప ముక్క తగిలి నరం కట్ అయింది. రక్త స్రావం కూడా జరిగింది. రక్తా స్రావాన్ని ఆపడానికి కుట్లు వేశారు. షో స్టాఫ్ టీమ్, డాక్టరు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వాకింగ్ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారు" అని అమితాబ్ బచ్చన్ అన్నారు.
చివరిసారిగా బిగ్‌బీ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న 'ఉంచాయి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదలయ్యే అవకాశాలున్నాయి.