Amitabh Bachchan Corona: బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అమితాబ్‌కు కరోనా సోకిన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
అమితాబ్ కరోనా బారిన పడడం ఇది రెండోసారి. 2020లో కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆ సమయంలో బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. అమితాబ్ ప్రస్తుతం ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా క్రోర్‌పతి' కొత్త సీజన్ షూటింగ్‌లో ఉన్నారు. మరోవైపు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రధారులుగా అమితాబ్ నటించిన 'బ్రహ్మస్త్ర' చిత్రం త్వరలో విడుదల కానుంది.